విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో, "విరూపాక్ష" చిత్రబృందం ప్రమోషన్స్ ను ముమ్మరం చేస్తుంది. ఈ నేపథ్యంలో.. కాసేపటి క్రితమే హీరో సాయిధరమ్ తేజ్ విరూపాక్ష మూవీ నుండి సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు. అక్షరాల వెనకున్న అంకెలు.. ఆ అంకెలే కథకు ఆరంభం అంటూ ఒక ఇంట్రిగ్యుయింగ్ పోస్టర్ ను విడుదల చేసి, దానిని డీకోడ్ చెయ్యండంటూ ప్రేక్షకాభిమానులకు చిన్న సవాలును విసిరారు.
కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకుడు కాగా, సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు. BVSN ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 21న పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.