కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటో షూట్ నెటిజెన్స్ ని ఆకర్షించింది. నెట్ శారీలో ఈ హోమ్లీ బ్యూటీ పరువాల ప్రదర్శన చేసింది. కీర్తి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ మూవీ దసరా మార్చి 30న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషనల్ ఈవెంట్లో డిజైనర్ శారీ ధరించి కీర్తి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. ఇక శారీలో గ్లామరస్ ఫోటో షూట్ చేసి మనసులు దోచేసింది. ముఖ్యంగా ఆమె చురకత్తుల్లాంటి చూపులు గుండెలు కొల్లగొడుతున్నాయి.
పరిశ్రమకు చెందినవారు కాదు... కీర్తి సురేష్ లవర్ చిన్నప్పటి క్లాస్ మేట్ ని ప్రేమిస్తున్నారంటూ వార్తలు వెలువడుతున్నాయి. దాదాపు 13 ఏళ్లుగా కీర్తి అతన్ని ప్రేమిస్తున్నారట. సదరు క్లాస్ మేట్ వ్యాపారవేత్త అట. కేరళకు చెందిన ఆ యువకుడికి రిసార్ట్స్ బిజినెస్ ఉందట. ఈ విషయం ఇరు కుటుంబాల పెద్దలకు తెలుసట. ఈ క్రమంలో త్వరలో అధికారికంగా పెళ్లి ప్రకటన రానుందట. అయితే ఈ వార్తలను కుటుంబ సభ్యులు ఖండించారు. అయినా కీర్తికి ప్రేమించే తీరిక ఎక్కడుంది చెప్పండి. ఆమె వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల రివాల్వర్ రాణి టైటిల్ తో కొత్త మూవీ ప్రకటించారు. గత ఏడాది సర్కారు వారి పాట మూవీతో హిట్ కొట్టారు. కెరీర్లో ఫస్ట్ టైం మహేష్ కి జంటగా నటించిన కీర్తి గ్లామర్ తో ఆకట్టుకున్నారు. సర్కారు వారి పాట మూవీలో నెగిటివ్ షేడ్స్ కలిగిన రోల్ చేయడం విశేషం.
Embracing black #DasaraPromotions #Dasara pic.twitter.com/emHaK0VLRf
— Keerthy Suresh (@KeerthyOfficial) March 13, 2023