రీసెంట్గా విడుదలైన 'దాస్ కా ధమ్కీ' ట్రైలర్ 2.Oకి ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. దాస్ వచ్చిండంటే ఇగ మాములుగా ఉండదు యవ్వారం... 2 మిలియన్ వ్యూస్ తోటి యూట్యూబ్ ట్రెండింగ్లో నిన్నటి నుండి #1 పొజిషన్లో కొనసాగుతున్నాడు. ఇక ట్రైలర్, అన్ని కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ తో సినిమాపై అంచనాలను పెంచింది. ముఖ్యంగా విశ్వక్ సేన్ 2.O ని మనం ఈ సినిమాలో చూడవచ్చు.
'పాగల్' సినిమా తదుపరి హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ నివేదా పేతురాజ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి విశ్వక్ డైరెక్టర్ గా, సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండడం విశేషం. పోతే, ఈ సినిమా మార్చి 22న అంటే వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.