ఆదర్శ్, చైత్రశుక్ల హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం "గీతసాక్షిగా". దర్శకుడు ఆంటోనీ మట్టిపల్లి ఈ సినిమాను కొన్ని నిజజీవిత సంఘటనల ఆధారంగా రూపొందించారు. గోపీసుందర్ సంగీతం అందించారు.
తాజాగా ఈ రోజు గీతసాక్షిగా ట్రైలర్ విడుదలయ్యింది. లేడీ హాస్టల్ లో ఒక అమ్మాయి గుర్తు తెలియని వారిచేత ఘోరంగా చంపివేయబడుతుంది. ఈ కేసులో హీరో ఆదర్శ్ అనుకోకుండా ఇరుక్కుంటారు. చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్న ఆదర్శ్, తనను తాను నిర్దోషిగా కోర్టుకు ఎలా నిరూపించుకున్నాడు? హీరోయిన్ చిత్ర శుక్ల ఆదర్శ్ కి ఎలా సహాయపడుతుంది? .. అనే నేపథ్యంలో ఆడవాళ్ళపై జరుగుతున్న అన్యాయాలను , అత్యాచారాలను ప్రశ్నించే విధంగా ఈ సినిమా ఉండబోతుందని ట్రైలర్ ను బట్టి అర్ధం అవుతుంది.
చేతన్ రాజ్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, భరణి శంకర్, చరిష్మా, రూపేష్ శెట్టి, జయలలిత, అనిత చౌదరి, రాజా రవీంద్ర ఇతర కీలకపాత్రల్లో నటించారు. ఈ నెల 22న తెలుగుతో పాటుగా హిందీలో కూడా గీతసాక్షిగా విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa