కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం "మీటర్" నుండి రేపు ఫస్ట్ సింగిల్ 'ఛమ్మక్ ఛమ్మక్ పోరి' విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సాంగ్ రిలీజ్ పై మేకర్స్ నుండి బిగ్ అప్డేట్ వచ్చింది. రేపు సాయంత్రం ఐదున్నర నుండి ఇరు తెలుగు రాష్ట్రాలలోని ఎంపిక చెయ్యబడిన ముఖ్య కేంద్రాలలో మీటర్ ఫస్ట్ సింగిల్ లాంచ్ కాబోతుందని స్పెషల్ పోస్టర్ తో తెలియచేసారు.
రమేష్ కాదూరి ఈ సినిమాకు దర్శకుడు కాగా, అతుల్య రవి హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చిరంజీవి, హేమలత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే నెల 7న విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa