నాచురల్ స్టార్ నాని నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా బిగ్ బడ్జెట్ మూవీ "దసరా" యొక్క ట్రైలర్ ఈ రోజు విడుదల కాబోతుందన్న విషయం తెలిసిందే. కోల్కతాలోని ప్రతిభ థియేటర్లో దసరా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మధ్యాహ్నం 03:33 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సరిగ్గా 04:59 నిమిషాలకు పాన్ ఇండియా భాషల్లో దసరా ట్రైలర్ విడుదల కాబోతుందని కాసేపటి క్రితమే మేకర్స్ నుండి అఫీషియల్ పోస్టర్ వచ్చింది.
శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకుడు కాగా, నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. ఈ నెల 30న పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.
![]() |
![]() |