బాలీవుడ్ హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ ఆలియా భట్ ఈ రోజు 30వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేస్తున్నారు.
బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్, హీరోయిన్ సోనీ రజ్దాన్ లకు రెండో సంతానంగా ఆలియా భట్ జన్మించింది. సంఘర్ష్ సినిమాతో 1999లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగ ప్రవేశం చేసిన ఆలియా ఆపై 2012లో దిగ్గజ బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ దర్శకత్వంలో రూపొందిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాతో లీడ్ హీరోయిన్ గా డిబట్ చేసింది. తొలి సినిమానే సూపర్ డూపర్ హిట్. ఆపై హై వే, 2 స్టేట్స్, ఉడ్తా పంజాబ్, డియర్ జిందగీ, రాజి, గల్లీ బాయ్, కళంక్, గంగూభాయ్ కథియావాడి, RRR, డార్లింగ్స్, బ్రహ్మాస్త్ర వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించింది. బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదిగింది.