హీరో విశ్వక్ సేన్ ఔటండౌట్ మాస్ అవతార్ లో కనిపించబోతున్న చిత్రం "దాస్ కా ధమ్కీ". ఈ సినిమాకు విశ్వక్ సేనే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 22న పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతున్న ధమ్కీ కోసం విశ్వక్ వరస పెట్టి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఇప్పటికే వైజాగ్, కరీంనగర్లలో విశ్వక్ ధమ్కీ ప్రమోషన్స్ చెయ్యగా తాజాగా ఈ రోజు విజయవాడలో ధమ్కీ ప్రమోషన్స్ జరగబోతున్నాయి. ఇందుకోసం విశ్వక్ విజయవాడ రాబోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రెస్ మీట్, ఏడు గంటలకు SRM యూనివర్సిటీ కాలేజీ ఫెస్ట్ లలో విశ్వక్ పాల్గొంటారు.
నివేదా పేతురాజ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా, కరాటే రాజు నిర్మిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు.