మరో రెండ్రోజుల్లో ప్రేక్షకులను పలకరించబోతున్న "ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి" నుండి కాసేపటి క్రితమే కాఫీఫీ కాఫీఫీ అనే పెప్పి కాలేజీ సాంగ్ విడుదలయ్యింది. వివేక్ సాగర్ స్వరపరిచిన ఈ పెప్పి సాంగ్ ని బెన్ హ్యూమన్, విష్ణుప్రియ రవి ఆలపించారు. కిట్టు విస్సప్రగడ లిరిక్స్ అందించారు.
శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నటించిన ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా ప్రమోషనల్ కంటెంట్ తో ఆడియన్స్ లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. మరి, సంజయ్, అనుపమాల క్యూట్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీని తెలుసుకునేందుకు ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.