కొత్త దర్శకుడు ఉదయ్ శెట్టి తెరకెక్కిస్తున్న యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ "గం గం గణేశా". ఇందులో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. ఈ రోజు ఆనంద్ పుట్టినరోజు కావడంతో మేకర్స్ సరికొత్త పోస్టర్ ను విడుదల చేసి తమ హీరోకి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపారు. ఈ పోస్టర్ లో ఆనంద్ గన్ చేత పట్టుకుని కనిపిస్తారు. లోడెడ్ గన్ ..విత్ సాలిడ్ ఫన్ ..అంటూ మేకర్స్ ఈ పోస్టర్ కి క్యాప్షన్ ఇచ్చారు.
ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు.