యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త చిత్రం "మీటర్" నుండి కాసేపటి క్రితమే ఫస్ట్ సింగిల్ 'ఛమ్మక్ ఛమ్మక్ పోరి' విడుదలయ్యింది. సాయి కార్తీక్ స్వరకల్పనలో ఎలక్ట్రిఫయింగ్ బీట్స్ తో రూపొందిన ఈ పాటను అరుణ్ కౌండిన్య, గాయత్రి ఆలపించారు. బాలాజీ లిరిక్స్ అందించారు. ఈ పాటలో హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ అతుల్య రవిల అల్టిమేట్ డాన్స్ మూవ్మెంట్స్ ని మనం చూడవచ్చు.
రమేష్ కాదూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, క్లాప్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్త బ్యానర్ లపై చిరంజీవి, హేమలత నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 7న ఈ సినిమా థియేటర్లకు రాబోతుంది.