గ్లోబల్ సెన్సేషన్ RRR లోని నాటు నాటు పాట ఆస్కార్ దక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో నాటు నాటు డాన్సర్స్ రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల నెక్స్ట్ మూవీలపై అంతటా విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రామ్ చరణ్ RC 15 లో నటిస్తుండగా, తారక్ మాత్రం RRR తదుపరి ఏ సినిమాలో కనిపించలేదు. దీంతో తారక్ - కొరటాల శివ సినిమాపై అంచనాలు, ఎదురుచూపులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ నెల 23న పూజా కార్యక్రమాలతో ఎన్టీఆర్ 30 అఫీషియల్ లాంచ్ అవుతుందని, మార్చి 29 నుండి రెగ్యులర్ షూట్ మొదలవుతుందని తెలుస్తుంది.
ఈ సినిమాలో తారక్ కి జోడిగా బాలీవుడ్ అందం జాన్వీ కపూర్ నటిస్తుంది. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.