ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షారుఖ్ ఖాన్ "జవాన్" విడుదల వాయిదా..?

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 15, 2023, 05:56 PM

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం "జవాన్". లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. విజయ్ సేతుపతి విలన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.


గతంలో ఈ సినిమా నుండి విడుదలైన టైటిల్ గ్లిమ్స్ కి ఆడియన్స్ నుండి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ టైటిల్ గ్లిమ్స్ తో పాటుగానే మేకర్స్ విడుదల తేదీని కూడా ఎనౌన్స్ చేసారు. ఈ మేరకు జూన్ 2, 2023న ఈ సినిమా హిందీ, తమిళ్, తెలుగు భాషలలో విడుదల కావాలి. 


కానీ లేటెస్ట్ బజ్ ప్రకారం, జవాన్ రిలీజ్ డేట్ వాయిదా పడిందని అంటున్నారు. అక్టోబర్ 2న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ విషయంపై ఇంకా మరింత సమాచారం అందవలసి ఉంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com