నాగార్జున యూనివర్సిటీలో అకడమిక్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి హాజరైన చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విద్యార్థులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తే అక్కడ రంభ, ఊర్వశిలు ఉండకపోవచ్చని.. అందువల్ల జీవితాన్ని ఇక్కడే ఎంజాయ్ చేయాలని చెప్పారు. ఎవరికి నచ్చిన విధంగా వారు బతకాలని అన్నారు. కష్టపడకుండా, టీచర్ల మాటలు వినకుండా ఇష్టమొచ్చినట్లు బతకాలి, తాగి, తిని, ఆనందించాలి అని అన్నారు. ఏదైనా వైరస్ వచ్చి నేను తప్ప మగ వాళ్లంతా పోవాలని... అప్పుడు తానొక్కడినే స్త్రీ జాతికి దిక్కవుతానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.