ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీటర్ : ఛమ్మక్ ఛమ్మక్ పోరి పాటకి 1M వ్యూస్

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 16, 2023, 03:47 PM

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త చిత్రం "మీటర్" నుండి నిన్న విడుదలైన ఫస్ట్ సింగిల్ 'ఛమ్మక్ ఛమ్మక్ పోరి' పాటకు ఆడియన్స్ నుండి 1 మిలియన్ వ్యూస్ తో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. సాయి కార్తీక్ స్వరకల్పనలో ఎలక్ట్రిఫయింగ్ బీట్స్ తో రూపొందిన ఈ పాటను అరుణ్ కౌండిన్య, గాయత్రి ఆలపించారు. బాలాజీ లిరిక్స్ అందించారు. ఈ పాటలో హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ అతుల్య రవిల అల్టిమేట్ డాన్స్ మూవ్మెంట్స్ ని మనం చూడవచ్చు.


రమేష్ కాదూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, క్లాప్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్త బ్యానర్ లపై చిరంజీవి, హేమలత నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 7న ఈ సినిమా థియేటర్లకు రాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com