ప్రపంచవ్యాప్తంగా రేపు గ్రాండ్ రిలీజ్ కాబోతున్న చిత్రాలలో "కబ్జా" ఒకటి. ఉపేంద్ర, కిచ్చా సుదీప్ కలిసి నటించిన ఈ సినిమాలో శ్రేయా శరణ్, శివరాజ్ కుమార్ కీరోల్స్ లో నటించారు. రవి బసృర్ సంగీతం అందించారు.
మరి, రేపు విడుదల కాబోతున్న నేపథ్యంలో కబ్జా చిత్రబృందం ఈ రోజు శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని, దివ్య ఆశీస్సులను పొందారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.