సృజనాత్మక దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధానపాత్రలు పోషిస్తున్న చిత్రం "రంగమార్తాండ". లిరికల్స్ సాంగ్స్ తో ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్న ఈ చిత్రం, మరాఠీ సూపర్ హిట్ ఎమోషనల్ డ్రామా 'నట్ సామ్రాట్' కి అఫీషియల్ తెలుగు రీమేక్ గా రూపొందుతుంది.
తాజా సమాచారం ప్రకారం, రంగమార్తాండ సెన్సార్ పూర్తి చేసుకుందని తెలుస్తుంది. సెన్సార్ బృందం నుండి ఈ సినిమాకు క్లీన్ 'యూ' సర్టిఫికెట్ వచ్చింది. ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కాలేపు మధు, ఎస్ వెంకట్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.