కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అక్టోబర్ 29, 2021న అకాల మరణం చెందారు. ఒక సంవత్సరం తర్వాత, నటుడి చివరి చిత్రం 'గంధడ గుడి' విడుదలై మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఇప్పుడు, ఈ చిత్రం ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ లో మార్చి 17, 2023న డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. అమోఘవర్ష జెఎస్ రచన మరియు దర్శకత్వం వహించిన ఈ డాక్యుడ్రామాకు అంజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.