సాయి కిరణ్ దర్శకత్వంలో సంగీత, తిరువీర్ నటించిన 'మసూద' సినిమా విడుదలై 2022 బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ రన్ తర్వాత ఈ చిత్రం OTTలో కూడా అద్భుతమైన స్పందనను పొందింది. తాజాగా ఈ హారర్ చిత్రం జెమినీ టీవీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రదర్శించగా 5.22 TRPని సంపాదించింది.
ఈ హర్రర్ డ్రామాలో శుభలేక సుధాకర్, అఖిలా రామ్, కావ్య కళ్యాణ్‌రామ్, బాంధవి శ్రీధర్ మరియు ఇతరులు కీలక పాత్రలో నటించారు. రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు.