మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా 'ఆరెంజ్'. ఈ సినిమాలో జెనీలియా హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2010లో నవంబర్ 26న విడుదలైంది. అయితే ఈ సినిమాలో పాటలు రామ్ చరణ్ సినీ కెరీర్ లో ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. ఈ సినిమాకి హారిస్ జయరాజ్ సంగతం అందించారు. ఈ సినిమాను అంజనా ప్రొడక్షన్ బ్యానర్ పై నాగబాబు నిర్మించారు. తాజాగా ఈ సినిమా రీరిలీజ్ కాబోతుంది. ఈ సినిమాను రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ నెల 27న రీ రిలీజ్ థియేటర్లో చేయనున్నారు.