సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, వైవా హర్ష, బిగ్ బాస్ వాసంతి, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, ధనరాజ్, గోపరాజు రమణ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం "భువనవిజయమ్". యలమంద చరణ్ రచించి, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా యొక్క టీజర్ రీసెంట్గానే విడుదల కాగా, దానికి ఆడియన్స్ నుండి 1మిలియన్ వ్యూస్ తో సూపర్ రెస్పాన్స్ వస్తుంది. హిమాలయ స్టూడియో మ్యాన్షన్స్, మిర్త్ మీడియా సంయుక్త బ్యానర్లపై ఉదయ్ కిరణ్, శ్రీకాంత్ నిర్మించిన ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.