రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కన్నడ యాక్షన్ డ్రామా 'కాంతారా' రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, త్వరలోనే ఈ విలేజ్ డ్రామా సినిమా మరో రెండు భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఇటలీ మరియు స్పెయిన్‌లలో వారి మాతృభాషలలో విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి.
ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా రిషబ్ శెట్టి ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ యాక్షన్-థ్రిల్లర్ సినిమాలో కిషోర్ కుమార్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి మరియు వినయ్ బిడ్డప్ప ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అంజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు.