బాసిల్ జోసెఫ్ మరియు హృదయం ఫేమ్ దర్శనా రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'జయ జయ జయ జయ హే' చిత్రం 2022లో అద్భుతమైన బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. విపిన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మహిళలపై జరిగే హింస గురించి. తాజాగా ఈ సినిమా హిందీలో రీమేక్ కానుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. హిందీలో దర్శనా రాజేంద్రన్ పాత్రను దంగల్ నటి ఫాతిమా సనా షేక్ చేయనున్నట్లు లేటెస్ట్ టాక్. ఈ రీమేక్ వెర్షన్‌కు కూడా విపిన్ దాస్ దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో లేటెస్ట్ టాక్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa