ఆచార్య వంటి డిజాస్టర్ తదుపరి డైరెక్టర్ కొరటాల శివ, RRR వంటి గ్లోబల్ సెన్సేషన్ తదుపరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి పనిచెయ్యబోతున్న చిత్రం "ఎన్టీఆర్ 30". ఇద్దరికీ చాలా కీలకమైనటువంటి ఈ సినిమా గతేడాది అఫీషియల్ గా ప్రకటింపబడగా, దాదాపు ఏడాది తరవాత ఈరోజు లాంఛనంగా ప్రారంభమయ్యింది. ఈ రోజు ఉదయం అధికారిక పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన తదుపరి సినిమా ఎలా ఉండబోతుందో ... చెప్తూ, కథా నేపధ్యాన్ని కొరటాల మీడియాకు వివరించారు.
అంతరించిపోతున్న కోస్టల్ ల్యాండ్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, అక్కడ మనుషులు మనుషులకి కాకుండా బీస్ట్ లకు దగ్గరగా ఉంటారు. ఈ కథలో మనుషుల కంటే మృగాలు ఎక్కువ ఉంటాయి. దేవుడు అంటే భయం లేదు... చావు అంటే భయం లేదు.. కానీ ఒకే ఒక్కటి అంటే భయం.. ఆ భయం ఏంటో మీకు తెలిసే ఉంటుంది. ప్రేక్షకాభిమానులకు మాటిస్తున్నా.. ఖచ్చితంగా ఈ సినిమా నా కెరీర్ లో ది బెస్ట్ అవుతుంది.. అని కొరటాల పేర్కొన్నారు