మాస్ రాజా రవితేజ నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "రావణాసుర". సుధీర్ వర్మ దర్శకత్వంలో వినూత్న కధాంశంతో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 7వ తేదీన విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితమే మేకర్స్ ఒక బిగ్ అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే, రేపు ఉదయం 10:08 నిమిషాలకు రావణాసుర మూవీ నుండి ఒక మాస్సివ్ అప్డేట్ రాబోతుందని స్పెషల్ పోస్టర్ తో తెలిపారు. ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుశాంత్ కీరోల్ లో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa