ట్రెండింగ్
Epaper    English    தமிழ்

OTTలో అందుబాటులోకి వచ్చిన 'ఏజెంట్ కన్నయిరం' తెలుగు డబ్బింగ్ వెర్షన్‌

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2023, 07:53 PM

2019లో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' తో భారీ హిట్ సాధించాడు. తాజాగా మనోజ్ బీద దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ప్రముఖ కమెడియన్ సంతానం 'ఏజెంట్ కన్నయిరం' అనే టైటిల్ తో రీమేక్ చేయగా ఈ సినిమా నవంబర్ 25, 2022న విడుదల అయ్యింది. ఈ సినిమా తమిళ వెర్షన్ బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఈ చిత్రం డిసెంబర్ 23 నుండి సన్ నెక్ట్స్‌లో ప్రసారం అవుతోంది.


తాజాగా ఇప్పుడు, ఈ తమిళ రీమేక్ మళ్లీ తెలుగులోకి డబ్ చేయబడింది మరియు డబ్బింగ్ వెర్షన్ ఇప్పుడు సన్ నెక్ట్స్‌లో ప్రసారం అవుతోంది. ఈ చిత్రంలో రియా సుమన్, శృతి హరిహరన్, పుగజ్, మునిష్కాంత్ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లాబ్రింత్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa