నూతన దర్శకుడు రమేష్ కడూరి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'మీటర్' అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ సినిమాలో కోలీవుడ్ బ్యూటీ అతుల్య రవి కథానాయికగా నటిస్తోంది. ఏప్రిల్ 7, 2023న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క థియేట్రికల్ ట్రైలర్‌ను మార్చి 29, 2023న విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ట్రైలర్ లాంచ్ గురించి మరిన్ని వివరాలు త్వరలో మూవీ టీమ్ వెల్లడించనుంది. సాయి కార్తీక్ ఈ సినిమాకి సౌండ్‌ట్రాక్‌ను స్కోర్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, చిరంజీవి (చెర్రీ) క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుంది.