హాస్యనటుడు వేణు యెల్దండి దర్శకత్వం లో నటుడు ప్రియదర్శి కొత్త చిత్రం 'బలగం' తెరపైకి వచ్చి పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సర్వీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తానికి సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో పలు భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది.
ఈ చిత్రం ఇప్పుడు భారతదేశంలోని ప్రైమ్ వీడియో చార్ట్‌లలో రెండవ స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. చాలా మంది నెటిజన్లు ఈ సినిమా గురించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు మరియు వేణు భావోద్వేగాలను హ్యాండిల్ చేసిన విధానానికి ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
ఈ చిన్న బడ్జెట్ సినిమాలో కావ్య కళ్యాణ్‌రామ్ కథానాయికగా నటిస్తుంది. వేణు, మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రాచ రవి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు.