ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. తాజాగా ఈ సినిమాపై ఓ బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా VFX కోసం హాలీవుడ్ టెక్నీషియన్ 'బ్రాడ్ మిన్నిచ్' ను తీసుకువచ్చారు. దీంతో ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో అర్థం అవుతోంది. కాగా ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సాబు సిరిల్ ని ప్రొడక్షన్ డిజైనర్ గా కూడా పెట్టుకున్నారు.