కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ తన 62వ ప్రాజెక్ట్ ని యువ తమిళ దర్శకుడు మగిజ్ తిరుమేనితో చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం ఫిబ్రవరి చివరి వారంలో చిన్న పూజతో ప్రారంభించబడింది. తాజా అప్డేట్ ప్రకారం, ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ మే నుండి ప్రారంభమవుతుంది అని సమాచారం. ఏప్రిల్‌లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ కి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. కోలీవుడ్ హిట్ మెషిన్ అనిరుధ్ రవిచందర్ ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్కు సంగీతం అందిస్తున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.