సినిమాల విషయంలో ఫ్యామిలీ సపోర్ట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఇండస్ట్రీలో తాను చేసిన ఒంటరి పోరాటం కూడా గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీలో స్టార్ డమ్ కోసం చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్న హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ స్టార్ ఇమేజ్ కోసం ఎంతో ప్రయత్నిస్తుంటారు. కాని ఫలితం లేకు వదిలేసిన వాళ్లు ఇంకొంత మంది. అదేంటో కొందరు హీరోయిన్లకు మొదటి సినిమాతోనే స్టార్ డమ్ అలా వచ్చిపడుతుంటుంది. అలాంటి హీరోయిన్లలో మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు.టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే స్టార్ డమ్ వచ్చిన తారలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆలిస్ట్ లో సీతా రామం బ్యూటీ కూడా ఉంది. సీతారామం సినిమాతో సంచలన విజయాన్ని సాధించింది మృణాల్. ఈ సినిమాతో టాలీవుడ్ నుంచి భారీ ఆఫర్లు కూడా అందుకుంటుంది చిన్నది.
అసలు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి వారికిపెద్దగా తెలియకపోవడమే అందుకు కారణం. అందువల్లనే వారునన్ను సపోర్ట్ చేయలేకపోయారు అన్నారు. నేను ఒంటరిగా ఇండస్ట్రీలోకి వచ్చి.. ఒంటరిగానే పోరాటం చేశాను అన్నారు మృణాల్. అందుకే నాలో ఈ ధైర్యం అంటూ కామెంట్లు చేసింది హీరోయిన్.