బాలీవుడ్ చిత్రపరిశ్రమపై నటి కాజల్ అగర్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ లో నైతికత లోపించిందని, దక్షిణాది సినీ పరిశ్రమలో ఉన్న విలువలు బాలీవుడ్ లో లేవని అన్నారు. తను పుట్టి పెరిగింది ముంబై అయినా, కెరీర్ హైదరాబాద్ లో మొదలైందని, తెలుగు, తమిళం లోనే ఎక్కువగా పనిచేశానని తెలిపారు. దక్షిణాదిలో స్నేహపూర్వక వాతావరణం ఉంటుందని, అద్భుతమైన దర్శకులు, టెక్నీషియన్స్ అక్కడ ఉన్నారని కాజల్ అభిప్రాయపడ్డారు.