వెండితెరపై అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సోనాలి బింద్రే.. కాన్సర్ కారణంగా గత కొంతకాలంగా న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆ చికిత్స పూర్తికావటంతో ఇటీవలే ముంబై చేరుకుంది. అయితే ఈ రోజే తాను తిరిగి సెట్స్ అడుపెట్టానని సోషల్ మీడియా వేదికగా పేర్కొంటూ ఆనందం వ్యక్తం చేసింది సోనాలి. ‘‘చాలా గ్యాప్ తర్వాత తిరిగి సెట్స్ పైకి వచ్చాను. ఇదంతా ఓ కలలా అనిపిస్తోంది. మళ్లీ కెమెరా ముందుకొచ్చినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా. తిరిగి కెమెరా ముందు నిలబట్టపుడు కలిగిన ఆ ఫీలింగ్స్ మాటల్లో చెప్పలేను’’ అని పేర్కొంది సోనాలి. అయితే ఇది ఏ సినిమా సెట్స్ అనే విషయం మాత్రం వెల్లడించలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa