ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జయం రవి 32వ చిత్రానికి టైటిల్ అదేనా?

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 06, 2023, 08:44 PM

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి 32వ చిత్రాన్ని వేల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌ భారీ స్థాయిలో నిర్మిస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు భువనేష్ దర్శకత్వం వహిస్తాడని సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రానికి 'జెనీ' అనే టైటిల్‌ని పెట్టినట్లు సమాచారం. ఈ 100 కోట్ల బడ్జెట్ ప్రాజెక్ట్ కి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో టాక్. మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 2 విడుదలైన తర్వాత ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com