టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ నటించిన యాక్షన్ కామెడీ డ్రామా 'ధమ్కీ' మార్చి 22, 2023న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు ముగింపు దశకు చేరుకుంది. దాస్ కా ధమ్కి యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ఆహా ఇప్పుడు ఈ చిత్రం ఏప్రిల్ 14 నుండి స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటుందని ప్రకటించింది.
ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ విశ్వక్సేన్ కి జోడిగా నటిస్తుంది. రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వన్మయే క్రియేషన్స్ మరియు విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లు ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీత అందిస్తున్నారు.