ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తన తదుపరి పాన్ ఇండియన్ చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'స్పై' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ లో నిఖిల్ సరసన ఈశ్వర్యా మీనన్ జోడిగా నటిస్తోంది.
తాజాగా ఇప్పుడు, ఈ సినిమా యొక్క నాన్-థియేట్రికల్ హక్కులను అమెజాన్ మరియు స్టార్ నెట్వర్క్ 40 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఎడ్ ఎంట్రయిన్మెంట్స్పై కె రాజ శేఖర్ రెడ్డి ఈ పాన్ ఇండియా సినిమాని నిర్మిస్తున్నారు.