హీరోయిన్ నయనతార ఓ అభిమానిపై మండిపడింది. హనుమాన్ జయంతి సందర్భంగా నయన్, ఆమె భర్త విఘ్నేశ్ తంజావూరులోని తమ కులదైవం ఆలయానికి వెళ్లారు. తిరుగుప్రయాణంలో రైలులో వెళ్తుండగా ఓ యువకుడు ఆమెతో వీడియో తీసుకునేందుకు అత్యుత్సాహం కనబరిచాడు. అప్పటికే కోపంగా ఉన్న నయన్ అతని ప్రవర్తనతో మరింత అసహనానికి లోనైంది. దీంతో వీడియో తీయడం ఆపకపోతే ఫోన్ పగలకొట్టేస్తా అని మండిపడింది.