వింక్ గర్ల్ ప్రియా ప్రకాష్ వారియర్, రోషన్ నటించిన ‘లవర్స్ డే’ చిత్రం ప్రేమికుల దినోత్సవం 14న రిలీజ్‌కు సిద్ధమైంది. తెలుగు, మలయాళంతోపాటు కన్నడ, తమిళ భాషల్లో ఈ చిత్రం ఏక కాలంలో విడుదల కానున్నది. క్రేజీ డైరెక్టర్ ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాతలు ఎ. గురురాజ్, సి.హెచ్.వినోద్‌రెడ్డి సుఖీభవ సినిమాస్ బ్యానర్‌పై అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీలోని ఫ్రేక్ పిల్లా సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. శ్రీజో సాహిత్యం అందించిన ఈ సాంగ్ ను దినకర్ ,నీతూ ఆలపించారు..షాన్ రెహ్మాన్ సంగీతం సమకూర్చాడు..
నటీనటులు:ప్రియా వారియర్, నూరిన్ షెరిఫ్, రోషన్, మాథ్యూ జోసఫ్, వైశాఖ్ పవనన్, మైఖేల్ యాన్ డేనియల్, దిల్‌రూపా, హరీష్ పెరుమన్న, అనీష్ జి మీనన్, షాన్ సాయి, అర్జున్ హరికుమార్, అతుల్ గోపాల్, రోష్న అన్‌రాయ్ తదితరులు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa