మణిరత్నం యొక్క మాగ్నమ్ ఓపస్ పొన్నియిన్ సెల్వన్-2 ఏప్రిల్ 28, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా రన్‌టైమ్ 157 నిమిషాలు (2 గంటల 37 నిమిషాలు) ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఎపిక్ పీరియడ్ డ్రామాలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరియు త్రిష కృష్ణన్ కీలక పాత్రలు పోషించారు. మద్రాస్ టాకీస్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ బిగ్గీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.