వర్ధన్ కేత్కర్ దర్శకత్వంలో ఆదిత్య రాయ్ కపూర్ నటించిన 'గుమ్రా' ఏప్రిల్ 7, 2023న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా విడుదలైన తొలిరోజు 1.1 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌లో సీతా రామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం తెలుగు హిట్ చిత్రం రెడ్ యొక్క రీమేక్. మిథూన్, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్చి, అభిజిత్ వాఘాని ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, మురాద్ ఖేతాని, క్రిషన్ కుమార్ మరియు అంజుమ్ ఖేతాని నిర్మించారు.