మాగ్నమ్ ఓపస్ 'RRR' తో గ్లోబల్ ఫేమ్ అందుకున్న టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ 'వార్ 2' చిత్రంతో బాలీవుడ్ అరంగేట్రం చేయబోతున్నాడనే విషయం అందరికి తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హృతిక్ రోషన్ కథానాయకుడిగా కనిపించనున్నాడు. YRF స్పై యూనివర్స్‌లో భాగమైన వార్ 2 యొక్క ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నట్లు సమాచారం. నవంబర్ 2023లో దీపావళి రోజున ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని క్రేజీ బజ్. యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa