టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాని యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకతంలో చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి తాత్కాలికంగా 'OG' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ పెట్టారు. ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌లో ప్రియాంక అరుల్ మోహన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
తాజా అప్డేట్ ప్రకారం, OG యొక్క రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 16, 2023 న ప్రారంభమవుతుంది' పవన్ కళ్యాణ్ మరియు ప్రియాంక అరుల్ మోహన్ ముంబైలో ఈ షెడ్యూల్‌లో పాల్గొంటారు అని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మూవీ మేకర్స్ నుండి త్వరలోనే వెలువడనుంది. ఈ బిగ్గీకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాని డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుంది.