నయనతార నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ఇమైక్క నోడిగల్. ఈ చిత్రాన్ని తెలుగులో అంజలి సిబిఐ ఆఫీసర్ పేరుతో అనువధిస్తున్నారు. ఆర్.అజయ్ జ్ఞానముత్తు ఈ క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కించారు. నయనతార సిబిఐ ఆఫీసర్ గా టైటిల్ రోల్ లో నటించింది. ఈ చిత్రంలో అథర్వ, రాశీ ఖన్నా కీలక పాత్రల్లో నటించగా.. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రతినాయకుడిగా నటించారు. ప్రముఖ హీరో విజయ్ సేతుపతి విక్రమాదిత్య అనే అతిథి పాత్రలో నటించారు. నయనతార భర్త పాత్ర ఇది. ఈ చిత్రాన్ని క్యామియో ఫిల్మ్స్ బ్యానర్ సంస్థలో సిజే జయకుమార్ నిర్మించారు. హిప్ హాప్ తమిళన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా.. ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందించారు. తెలుగు అనువాద కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. విశ్వశాంతి క్రియేషన్స్ బ్యానర్ పై తెలుగు హక్కులను నిర్మాతలు సిహెచ్ రాంబాబు, ఆచంట గోపీనాథ్ దక్కించుకున్నారు. ఫిబ్రవరి 22న అంజలి సిబిఐ ఆఫీసర్ విడుదల కానుంది.
#Nayanthara's #ImaikkaaNodigal as #AnjaliCBIOfficer in Telugu
Grand release on Feb 22nd
A film by @AjayGnanamuthu @Atharvaamurali @RaashiKhanna @anuragkashyap72 @VijaySethuOffl @CameoFilmsIndia @hiphoptamizha #ViswashanthiCreations pic.twitter.com/vyLzwjG6za
— BARaju (@baraju_SuperHit) February 5, 2019
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa