సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని 'ఏజెంట్' సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ హై బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. స్పై థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య నటిస్తుంది. ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఏప్రిల్ 28, 2023న విడుదలకు సిద్ధంగా ఉంది.
తాజాగా ఈరోజు మూవీ మేకర్స్ ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ మోడల్ నటుడు డినో మోరియా 'ది గాడ్' గా నటిస్తున్నట్లు అతని లుక్ ని రివీల్ చేసి ప్రకటించారు. రాజ్, అక్సర్, జూలీ మొదలైన పాత్రలకు పేరుగాంచిన డినో మోరియా ఈ పోస్టర్ లో చేతిలో మెషిన్ గన్‌తో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ కంపోజర్ హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తున్నారు.