భజరంగీ ఫేమ్ హర్ష దర్శకత్వంలో స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ 125వ చిత్రం 'వేద' కమర్షియల్‌గా విజయం సాధించింది. ఈ యాక్షన్ డ్రామా థియేట్రికల్ రన్ తర్వాత ఇప్పుడు ZEE5లో ప్రసారం అవుతోంది. తాజా అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం యొక్క తెలుగు-డబ్బింగ్ వెర్షన్ ఏప్రిల్ 16, 2023న జీ తెలుగు ఛానెల్‌లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రదర్శించనున్నట్లు సమాచారం.
ఈ మైల్‌స్టోన్ మూవీలో ఘనవి లక్ష్మణ్, ఉమాశ్రీ, అదితి సాగర్, శ్వేత చెంగప్ప తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గీతా పిక్చర్స్ మరియు జీ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి అర్జున్ జన్య సంగీతం అందించారు.