టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత మరో సారి కలిసి పని చేయనున్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ గాసిప్ హల్ చల్ చేస్తోంది. ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్ 2023లో ప్రారంభం కానుంది అని సమాచారం. మూవీ మేకర్స్ నుండి దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. రామ్ పోతినేని ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో నటిస్తున్న 'RAPO20' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. శ్రీలీల కథానాయికగా నటించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 20, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది.