టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'ఆరంజ్' సినిమా 2010 బాక్స్ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమా డీల్ చేసిన కాన్సెప్ట్ కారణంగా యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ సందర్భంగా ఈ సినిమా రి రిలీజ్ గా విడుదలైంది. ఈ సినిమా రి రిలీజ్ అయ్యిన అన్నిచోట్లా అద్భుతమైన కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.
తాజాగా ఇప్పుడు, ఈ మూవీ జపాన్‌లో విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జెనీలియా కథానాయికగా నటించింది. ఈ సినిమాలో నాగబాబు, మంజుల, ప్రకాష్ రాజ్, ప్రభు, శ్రీనివాస్ అవసరాల, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. నాగబాబు నిర్మించిన ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీత అందించారు.