RX 100 ఫేమ్ అజయ్ భూపతి కొన్ని రోజుల క్రితం తన తదుపరి సినిమాకి 'మంగళవరం' అనే టైటిల్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ పాన్-ఇండియన్ సినిమాలో గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ కథానాయికగా నటిస్తుంది. తాజాగా చిత్రబృందం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. బోల్డ్ అవతార్‌లో పాయల్ రాజ్‌పుత్ కనిపించిన పోస్టర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఫిమేల్ సెంట్రిక్ ట్రాక్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాంతారావు ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.