ప్రియాంక అరుల్ మోహన్ క్యూట్ అందాలతో ఆకట్టుకుంటోంది. నానితో కలిసి నటించి మెప్పించిన ఈ భామ ఇప్పుడు పవన్‌తో జోడీ కట్టబోతుంది. దీంతో తరచూ ఈ బ్యూటీ హాట్ టాపిక్ అవుతుంది. పవన్ ఫ్యాన్స్ ఏం రేంజ్‌లో హంగామా చేస్తారో తెలిసిందే. పవన్‌తో చేయబోయే నటీనటులను ఓ రేంజ్‌లో పాపులర్ చేస్తారు. వారిని ట్రెండ్ చేస్తుంటారు. తాజాగా క్యూట్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ ని ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ బ్యూటీ తాజాగా తన గ్లామర్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకోవడమే. వైట్ షర్ట్ ధరించి ఆమె ఫారెస్ట్ ఏరియాలో ఫోటో షూట్ చేసింది. డిఫరెంట్ పోజులతో ఆకట్టుకుంది. క్యూట్‌గా, హాట్‌గా, సెక్సీగా, కొంటెగా, విరహంతో ఇలా విభిన్న యాంగిల్స్ లో ఆమె ఫోటోలకు పోజులిచ్చి ఆకట్టుకుంది. ఇందులో ప్రియాంక టూ క్యూట్‌గా, హాట్‌గా ఉంది. మరింత అందంగా కనిపిస్తుంది. ఆమె ఇచ్చిన పోజులు మాత్రం మతిపోయేలా ఉన్నాయి. దీంతో ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్నాయి. ఇది చూసిన పవన్ ఫ్యాన్స్ ఈ అమ్మడిని మరింత ట్రెండ్ చేస్తూ వైరల్ గా మారుస్తున్నారు. ఓజీ హీరోయిన్ అంటూ, ఓజీ బ్యూటీ అని, ఓజీ గర్ల్ కిర్రాక్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఓజీ గర్ల్ వచ్చింది, మిగిలినవారంతా పక్కకెళ్లండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.
jimikki ponnu #PriyankaArulMohan photoshoot pic.twitter.com/J9d67QyDUX
— Cinema Press Club (@cinemapressclub) April 26, 2023