శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన "దసరా" సినిమా మార్చి 30, 2023న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల అయ్యి బాక్స్ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం ఏప్రిల్ 27, 2023న నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది.
యాక్షన్ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో ధీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, పూర్ణ, ఝాన్సీ, సాయి కుమార్, సముద్రఖని, జరీనా వహాబ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.